పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీపెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బిపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.