రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేందుకు పటిష్ట ప్రణాళికతో, సమన్వయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు.
పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.