ఎన్టీఆర్ జిల్లాలో మంగళవారం ఉక్కపోత పెరుగుతుందని అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని APSDMA తన అధికారిక X ఖాతాలో వెల్లడించింది.