ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కొండపల్లి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓ పక్క అభివృద్ధి చేస్తుంటే మరోపక్క ప్రకృతికి ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతింటున్నాయి. కొండపల్లి ఖిల్లాకు వెళ్లే మార్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. ప్రతినిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. మూడవ టర్నింగ్ వద్ద రోడ్డు ప్రమాదంగా మారింది.