కోడూరు మండల పరిధిలోని కృష్ణాపురం నుండి నరసింహపురం వెళ్లే డ్రైనేజీని బాగు చేయాలని ఆ ప్రాంత రైతాంగం ప్రభుత్వాన్ని, అధికారులను కోరుకుంటున్నారు. భారీ వర్షాలు పడితే వందలాది ఎకరాల పంట నీట మునిగిపోతుందని, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రాంత రైతులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డ్రైనేజీ ఆనుకుని దాదాపు 1500 పైగా ఎకరాలు వరి, అపరాలను సాగు చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించాలన్నారు.