కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన రాజ్, నూతక్కి శ్రీనివాస్ అనే ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరు కారులో ప్రయాణిస్తూ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దృశ్యాలు ఎంతో భయంకరంగా ఉండగా, మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.