కృష్ణా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

72చూసినవారు
కృష్ణా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై–కోల్ కతా జాతీయ రహదారిపై ఒక కారు, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్