విజయవాడ సూర్యారావుపేటలో తెలుగు టీచర్ గా పని చేస్తున్న భువనచంద్ర అనే గతంలో వ్యక్తి మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు కాగా, తాజాగా మంగళవారం పోక్సో కోర్టు జడ్జి వి. భవానీ నిందితుడుకి 10ఏళ్లు కఠిన కారాగార శిక్ష, 20 వేలు జరిమాన విధించారు. సదరు బాధిత బాలికకు జరిమానా నుండి 10 వేలతోపాటు రూ. 3 లక్షలు పరిహారంగా అందజేయాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ఆధారిటి వారిని ఆదేశించారు.