ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలో వేంచేసియున్న సీతా లక్ష్మణ హనుమాన్ సమేత కోదండరామచంద్రస్వామి వారి దేవస్థాన ప్రథమ వార్షిక మహోత్సవములు ఆదివారం కన్నుల పండుగగా జరిగాయి. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.