ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోర్స్ ను పునరుద్ధరించండి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులకు ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత తో కలిసి ఒకటవ డివిజన్ ప్రాంతం లో గల మధుర నగర్, పప్పుల మిల్ సెంటర్ పరిసర ప్రాంతాలన్ని పరిశీలించారు.