విజయవాడలో మ‌గ‌వారికి పొదుపు సంఘాలు..!

52చూసినవారు
విజయవాడలో మ‌గ‌వారికి పొదుపు సంఘాలు..!
డ్వాక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడ, విశాఖపట్టణంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏప్రిల్‌లో వీటిని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేశారు.

సంబంధిత పోస్ట్