ఏడాదిగా బుడమేరుకి గండ్లు పడితే ఏమి చేయని, చేతకాని వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గురువారం ఉదయం విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద బాధితులను సందర్శించే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల కష్టాలని గాలికి వదిలి పెట్టి, ఇప్పుడు నన్ను చూసి బురదలో దిగాడు అని ప్రజలు కష్టాల్లో ఉంటే ఈయన లాగా ప్యాలెస్ లో కూర్చోవాలా? ఇలాంటి వ్యక్తికి నేను సమాధానం చెప్పాలా అంటూ ప్రశ్నించారు.