ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, పశ్చిమ గోదావరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడుతోంది. మరోవైపు విజయవాడలో భారీ వర్షంతో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది.