కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి వివరించే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరుగుతుంది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భోజన సమావేశం నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడుతారు. సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వెళ్తారు.