ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం "ప్రజా సమస్యల పరిష్కార వేదిక'' కార్యక్రమం సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. బాధితులు నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 64 ఫిర్యాదులు వచ్చాయని డి. సి. పి. ఉదయారాణి తెలిపారు. భాదితులతో పాటుగా, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నమన్నారు. ఫోన్ ద్వారా సంబంధిత, ఎస్. హెచ్. ఓ లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.