విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు ఆత్మహత్య ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిన్న (శనివారం) ఉదయం వాకింగ్‌కి వెళ్తానని చెప్పి, క్షత్రియ భవన్ లో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతికి బుద్దిరాజు శివాజీ, పిన్నమనేని పరంధామయ్యలే కారణమని భార్య శాంతి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.