విజయవాడ: అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేశారు: మాజీ ఎమ్మెల్యే మల్లాది

79చూసినవారు
విజయవాడ: అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేశారు: మాజీ ఎమ్మెల్యే మల్లాది
విజయవాడ నగరం నడిబొడ్డులోని అంబేద్కర్ స్మృతివనాన్ని పది నెలలుగా నిర్లక్ష్యం చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. చివరకి రాత్రిపూట కరెంట్‌ కూడా తీసేశారన్నారు. స్మృతివనాన్ని డ్వాక్రా బజార్‌కు అద్దెకు ఇచ్చారని విమర్శించారు. రైతుబజార్ పెడతామని అంటున్నారని, కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ను అవమానిస్తోందని ఆయన విమర్శిచారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్‌ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్