రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. గురువారం విజయవాడ తన అధ్యక్షతన జరిగిన 4వ ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు.