సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరేలా బీసీ బిడ్డలు సివిల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణులై అత్యున్నత కొలువులు సాధించాలని మంత్రి ఎస్. సవిత ఆకాంక్షించారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్ ను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, విశ్రాంతి గదులను పరిశీలించారు.