విజయవాడ నగరంలో వచ్చే నెల నుంచి క్లీన్ ఎయిర్ జోన్ ప్రాజెక్టు అమలు కోసం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధమైంది. రమేశ్ ఆసుపత్రి జంక్షన్, సిద్దార్థ కళాశాల పరిసరాలలో మొదట ప్రాజెక్టును అమలు చేస్తామని ఏపీపీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య బుధవారం వివరించారు. ఈ ప్రాజెక్టు అమలుతో కాలుష్యం తగ్గి గాలి నాణ్యత మెరుగుపడుతుందన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు తక్కువ వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్వహిస్తామని కృష్ణయ్య పేర్కొన్నారు.