విజయవాడ ఎం. జి రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా చేపట్టిన తిరంగా యాత్రలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. త్రివర్ణ పతకాలు చేతపట్టిన వీరు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు వేలాది మంది ప్రజలతో కలసి తిరంగా యాత్రలో పాల్గొన్నారు. కూటమి నేతలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.