విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు బుధవారం మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసి కార్యాలయం నుంచి ప్రారంభమైన ‘యువత పోరు’ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.