శ్రీధర్ సిసిఈ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్ పో 2024 ఘనంగా ప్రారంభమైంది. సూర్రావుపేటలోని చిలుకు దుర్గయ్య వీధిలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కరెన్సీ ఎగ్జిబిషన్ ను శుక్రవారం కాయిన్ ఎగ్జిబిషన్ లో ఆర్కియాలజీ కమిషనర్ వాణిమోహన్ ప్రారంభించగా కరెన్సీ నోట్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ యస్ వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు.