యోగాంధ్ర-2025లో భాగంగా ఈ నెల 11న విజయవాడ బెరం పార్క్ వద్ద వాటర్ క్రాఫ్ట్-ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టరేట్‌లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. యోగా చరణతో సంపూర్ణ ఆరోగ్యానికి చేరువై ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు ప్రజలు పాలుపంచుకోవాలన్నారు.