తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. శనివారం విజయవాడ ఆగిరపల్లి మండలము నెక్కలం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ. 2. 30 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్డును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు.