వేట నిషేదం ముగియడంతో మత్స్యకారులకు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేపల వేట సాగించాలని మంత్రి శనివారం సూచించారు. వేట నిషేధ కాలంలో 1,29,178 మంది మత్స్యకారులకు రూ.258.356 కోట్లను వేట నిషేధిత కాలం భృతి అందించినట్లు గుర్తు చేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.20 వేలు ఇచ్చమన్నారు. మాట నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.