విజయవాడ నుంచి చర్లపల్లి, తిరుపతి మధ్య నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ప్రయాణికుల రద్దీ కారణంగా పొడిగించారు. జూలై 2 నుంచి 30 వరకు ప్రతి బుధవారం చర్లపల్లి - తిరుపతి (07251) రైలు, జూలై 3 నుంచి 31 వరకు ప్రతి గురువారం తిరుపతి- చర్లపల్లి (07252) రైలు నడుస్తాయని వివరించారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని వివరించారు.