విజయవాడ సింగ్‌నగర్ లూనా సెంటర్ రోడ్డులోని డ్రైనేజీ మ్యాన్‌హోల్ చుట్టూ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాంతంలో పాదాచారులకు, వాహనాదారులకు ఇబ్బందిగా ఉందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరుగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.