విజయవాడ: జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలి: బుద్ధా వెంకన్న

62చూసినవారు
విజయవాడ: జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలి: బుద్ధా వెంకన్న
జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలను బుద్దా వెంకన్న ఖండించారు. విజయవాడలో గురువారం మాట్లాడుతూ.. జగన్ 2.0లో 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. జగన్ పరిపాలన నచ్చక ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, జగన్ భ్రమల్లో నుంచి బయటికి రావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్