విజయవాడ విద్యాధరపురం 44వ డివిజన్ దియా బార్ ఎదురు వేగ ఆటోమొబైల్ పక్కన ఉన్న వైన్స్ షాపు యజమానులు రోడ్డుపై అక్రమ నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులతో ముందే మాట్లాడుకున్నామని, ప్లానింగ్ సెక్రటరీ చక్రం తిప్పారని ఈ ప్రాంతంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ ముడుపులు అందుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.