కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి రైతులను హౌజ్ అరెస్ట్ చేయడంపై శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా స్పందించారు. వందలాది మంది పోలీసులు గ్రామాన్ని మోహరించడంపై నిప్పులు చెరిగారు. పచ్చని పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులను ఈ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తూహౌజ్ అరెస్ట్ లు చేయడం దుర్మార్గమన్నారు.