విజయవాడ: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

73చూసినవారు
విజయవాడ: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
విజయవాడలో అధికంగా మద్యం సేవించిన వ్యక్తి ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడి మృతి చెందాడు. శనివారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్డుకు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు వివరించారు. స్థానికుల సమాచారంతో సత్యనారాయణపురం పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వయసు సుమారు 45 నుండి 50 ఏళ్ల మధ్యగా ఉంటుందని  వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. వివరాలు తెలిసిన వారు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్