మంత్రి నారాయణ మంగళవారం కీలక ప్రకటన చేశారు. అమరావతిలో మరో ఎయిర్ పోర్ట్ రానుందని వివరించారు. మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యతులో మంగళగిరి, విజయవాడ, గుంటూరు, తాడేపల్లి కలిసి ఓ మెగా సిటీగా మారిపోతాయని అంచనా వేశారు.