ఇబ్రహీంపట్నం వి. టి. పి. ఎస్ ఏ కాలనీ మైదానంలో 'నారాయణ ప్రీమియర్ లీగ్ 2024-25' స్పోర్ట్స్ మీట్ పోటీలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ జెండాను ఎగురవేశారు. శాంతి కపోతాలను, బెలూన్లను ఎగురవేశారు. నారాయణ స్కూల్స్ వెస్ట్ జోన్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.