జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 10వ తేదీన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, వివిధ శాఖల అధికారులు సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు.