ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నూతన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. ఈ మండలిలో వైద్యారోగ్య రంగానికి చెందిన 8 మంది నిపుణులు సభ్యులుగా నియమితులయ్యారు. అలాగే, వైద్యవిద్య డైరెక్టర్, ఆయుష్ డైరెక్టర్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి తదితరులు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు. వైస్ చాన్స్‌లర్ ఈ మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.