పక్షవాతంతో అపస్మారక స్థితికి చేరుకున్న మస్తాన వలిని బంధువులు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు విజయవాడకు తరలించాలని సిఫార్సు చేశారు. ప్రైవేట్ అంబులెన్స్ ను ఆశ్రయించే స్థోమత లేక 108కు కాల్ చేయగా ఆలస్యం కావడంతో బంధువులు గురువారం రాత్రి రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగి బంధువులకు మధ్య వాగ్వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో రోగిని విజయవాడకు తరలించారు.