ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడి నష్టపోయిన సందర్భంలో రైతుకు భరోసా కల్పించేలా వ్యవసాయ ఆదాయ స్థిరీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలుచేస్తున్నాయని ఎన్టీఆర్ కలెక్టర్. జి. లక్ష్మీ షా అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీ షా పీఎంఎఫ్‌బీవైపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ, అధికారులతో సమావేశం నిర్వహించారు.