రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకూ నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. బుధవారం విజయవాడ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా తదితర శాఖల అధికారులకు వీడియో సమావేశం ద్వారా ఆదేశించారు. 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు.