జులై 5వ తేదీన రెవల్యూషనరీ విద్యార్థి సంఘం 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ స్థానిక ప్రభుత్వ బీసీ హాస్టల్ లో NTR జిల్లా అధ్యక్షులు నరేష్ కుమార్ నాయుడు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్, స్థానిక నాయకుడు శ్రీకాంత్ నాయుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో RSU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాసిరెడ్డి రఘురామిరెడ్డి పాల్గొన్నారు. మొదట జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కటింగ్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం అలుపెరగని పోరాటం RSU చేసిందని అన్నారు.