విజయవాడ ఇంద్రకీలాద్రి ఆదివారం జనసంద్రంగా మారింది. తొలి ఏకాదశి సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లు కిక్కిరిసి ఉండగా, లిఫ్ట్ మార్గం, ఘాట్ రోడ్డుపై పెద్ద సంఖ్యలో భక్తులు కనిపించారు. రద్దీ తగ్గించేందుకు ఏఈవోలు చర్యలు తీసుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలపై అధికారులు నియంత్రణ పెట్టారు.