విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గత ఏడాదిగా ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం 82 కేంద్ర ప్రాయోజిత పథకాలకు తిరిగి జీవం పోసిందన్నారు. ఈ పథకాల కోసం రూ. 14,479.31 కోట్లు ఖర్చు చేసిందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల అమలుకు నిధుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని సుజనా X (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.