ఈ నెల 11 వ తేదీ మంగళవారం రాష్ట్ర విజయవాడలో లో జరుగునున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నారు.