ప్రపంచంలో చాలా చోట్ల అత్యధిక సంపాదన తెలుగు వారిదేనని సీఎం చంద్రబాబు సోమవారం పొన్నెకల్లులో పర్యటనలో పేర్కోన్నారు. ప్రవాసాంద్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. బంగారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలో మౌలిక వసతులు చాలా వచ్చాయన్నారు. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పేదరిక నిర్మూలన కోసం పీ4 తెచ్చామని గుర్తుచేశారు.