జమ్మూ, కాశ్మీర్, పహాల్గంలోని ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించిందని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రమూకలపై దాడికి దిగిన రక్షణ బలగాల రక్షణకోసం ప్రార్థనలు, పూజలు చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యావాదలు తెలిపారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు సమిష్టిగా, బలంగా నిలబడదామన్నారు.