సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నాయకులు రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు టౌన్ PSలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యనారాయణపురం PSలో, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి పడమట PSలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.