నేడు తల్లుల కళ్లలో ఆనందం చూస్తున్నామని శాప్ ఛైర్మన్ రవినాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. యువగళంలో ఇచ్చిన మాటను లోకేశ్ నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. ఎంతమంది బిడ్డలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఒక బిడ్డ చదువుకుంటే మరో బిడ్డ చదివే పరిస్థితి లేదన్నారు. నేడు ఎంతమంది పిల్లలున్నా తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయని వివరించారు.