విజయవాడ: చీటింగ్ కేసులో రెండు సంవత్సరాలు జైలు శిక్ష

58చూసినవారు
విజయవాడ: చీటింగ్ కేసులో రెండు సంవత్సరాలు జైలు శిక్ష
విజయవాడలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణపురం పోలీసుల వివరాల మేరకు, కేసులో నిందితుడైన విశాఖపట్నం కంచరపాలెం చెందిన బండి సురేష్ (39) ఉద్యోగం ఇప్పిస్తానని వ్యక్తుల వద్ద నుండి డబ్బులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని, ఉద్యోగం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు కేసు నమోదు చేశామన్నారు. ఆపై నేరం ఋజువైనందున, శనివారం మూడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నామాల జ్యోతి నిందితునికి 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ 5, 000రూ జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్