విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం ఊపిరి పీల్చుకోవటం ఇబ్బందికరంగా ఉండటంతో జైలు అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీస్ అధికారులు వల్లభనేని వంశీని సబ్ జైలుకు తరలించారు. సుమారు గంటన్నర పాటు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.