అమరావతికి దేశంలోని మంచి కాలేజీలు వస్తున్నాయనీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను ఇక్కడకి తీసుకొస్తామని సోమవారం ప్రకటించారు. ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తున్నామని, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వాటితోనే అభివృద్ధి సాధ్యమైందని, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిందన్నారు. అప్పుడు తీసుకున్న చర్యలతో అందరి వద్ద ఫోన్లు ఉన్నాయన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047 విజన్ అని సీఎం అన్నారు.